: విమానాల్లో ఇక హిందీ మేగజైన్లు... డీజీసీఏ ఆదేశం!
ఆంగ్ల మేగజైన్లు, పత్రికలతో పాటు హిందీ వార్తాపత్రికలు, మేగజైన్లను విమాన ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని విమానయాన సంస్థలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించింది. ప్రయాణంలో హిందీ భాష మేగజైన్లు అందుబాటులో ఉంచకపోవడం భారత అధికార భాష విధివిధానాలకు విరుద్ధమని డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ లలిత్ గుప్తా తెలిపారు. ఇప్పటికే దేశీయ విమానాల్లో ఎకానమీ తరగతి ప్రయాణికులకు మాంసాహారాన్ని అందజేయడాన్ని ఎయిరిండియా వారు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ - `ఇక నుంచి విమానాల్లో శాకాహారంతో పాటు హిందీ మేగజైన్లు కూడా డీజీసీఐ అందించనుంది!` అని ట్వీట్ చేశారు.