: ఏటీఎంలను తెలివిగా దోచుకున్న వారు ఇంజనీరింగ్ నిపుణులు... కేసును ఛేదించిన విశాఖ పోలీసులు


దర్జాగా ఏటీఎంలోకి వచ్చి, కార్డు పెట్టి, ఆపై ఏటీఎం బాక్స్ ను మారు తాళంతో తెరిచి, పవర్ బటన్ ను ఆఫ్ చేయడం ద్వారా, డబ్బులు తీసుకుని, ఆ లావాదేవీని బ్యాంకు వరకూ వెళ్లకుండా చూస్తూ, అత్యంత నాటకీయంగా ఏటీఎంలను కొల్లగొట్టిన కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఈ కేసు సైబర్ నేరాల్లోనే వినూత్నమైనదని, ఇంజనీరింగ్ లో నిష్ణాతులైన ఇద్దరు ఏటీఎంల నుంచి డబ్బులను డ్రా చేయడంలో ఈ తరహా ప్రావీణ్యాన్ని సంపాదించారని పోలీసు అధికారులు తెలిపారు. విశాఖ పరిధిలోని ద్వారకా నగర్, ఎంవీపీ కాలనీల్లోని ఏటీఎంల దోపిడీ కేసులో యూపీకి చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రెండు ఏటీఎంల నుంచి రూ. 6.42 లక్షలను వీరు దోచుకున్నారని తెలిపారు. నిందితులను కోర్టు ముందు హాజరు పరచనున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News