: ఎదుటివారి బాధను చూసి, ఆనందపడేవారే ఎక్కువ.. వాళ్ల పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆందోళన చెందడం లేదు: అకున్ సబర్వాల్
ఎదుటివారి బాధలను, కష్టాలను చూసి ఆనందపడేవారే సమాజంలో ఎక్కువగా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల పిల్లలు ఏమైపోతున్నారో అనే ఆందోళన కూడా చాలా మందిలో కనిపించడం లేదని... ఏ సినీ నిర్మాత పేరు డ్రగ్స్ కేసులో ఉంది? డ్రగ్స్ వ్యవహారంలో ఏయే సినీ ప్రముఖులు ఉన్నారు? తదితర అంశాలపైనే వీరికి ఎక్కువ ఆసక్తి ఉందని అన్నారు. సినీ ప్రముఖుల విచారణ, వారి విచారణ తేదీలే వీరికి ముఖ్యమని చెప్పారు. దేశ భవిష్యత్తు పిల్లల చేతిలోనే ఉందని... వారి జీవితాలు నాశనం కావడం దేశానికి మంచిది కాదని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.