: నా భార్యతో కలసి లేట్ నైట్ షోలు చూస్తుంటా.. స్కూలు అమ్మాయిలు కూడా డ్రగ్స్ వాడుతున్నారు: అకున్ సబర్వాల్
టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారంపై ఉక్కుపాదం మోపిన ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. తన భార్య స్మితా సబర్వాల్ తో కలసి లేట్ నైట్లో తెలుగు సినిమాలను చూస్తుంటానని చెప్పారు. ఇటీవలే అల్లు అర్జున్ నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాకు వెళ్లామని... మధ్యాహ్నం సమయం కావడంతో, స్మిితకు ఆమె ఆఫీసు నుంచి ఫోన్ వచ్చిందని... దీంతో, తాము మధ్యలోనే లేచి వచ్చేశామని చెప్పారు. స్కూలుకు వెళుతున్న అమ్మాయిలు కూడా నిషేధిత డ్రగ్స్ ను వాడుతున్నట్టు ఎక్సైజ్ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తాను ఐపీఎస్ అధికారి కావడానికి పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ స్ఫూర్తి అని చెప్పారు.