: అద్భుతమైన డెలివరీకి అడ్డంగా దొరికిపోయిన ముకుంద్!


గాలేలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్, తొలి వికెట్ ను కోల్పోయింది. 8వ ఓవర్ వేసిన ప్రదీప్, తన మూడో బంతికి ఓపెనర్ అభినవ్ ముకుంద్ ను పెవీలియన్ దారి పట్టించాడు. 26 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసిన ముకుంద్ అవుట్ కావడంతో, 27 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ ను కోల్పోయినట్లయింది. ప్రదీప్ వేసిన బంతి వికెట్లకు దూరంగా వెళుతుంటే, లేని షాట్ ను ఆడేందుకు ప్రయత్నించిన ముకుంద్, డిక్ వెల్లాకు క్యాచ్ ఇచ్చాడు. ఆపై మరో ఓపెనర్ ధావన్ కు, ఛటేశ్వర్ పుజారా వచ్చి జత కలవగా, వారిద్దరూ కలసి స్కోరును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భారత స్కోరు 11 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 43 పరుగులు.

  • Loading...

More Telugu News