: శశికళ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళకు ఉచ్చు బిగుస్తోంది. ఆమెకు సంబంధించి రోజుకో అంశం వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, ఆమెపై కర్ణాటక ప్రభుత్వం నిఘా ఉంచింది. హోసూరు నుంచి అంబులెన్సులో ఆమెకు రకరకాల వస్తువులు వస్తున్నాయట. ఈ వ్యవహారం వెనుక కర్ణాటకకు చెందిన ఓ మంత్రి హస్తం ఉందని తేలడంతో, ఆయన ఎవరు? అనే చర్చ మొదలైంది.
ఈ క్రమంలో, కర్ణాటక డీజీపీ మొదలు, కీలక అధికారులందరికీ ఓ ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. దీంట్లో, జైల్లో శశికళకు కల్పిస్తున్న సౌకర్యాలను పూసగుచ్చినట్టు పేర్కొన్నట్టు సమాచారం. జైల్లో ఓ ఎస్ఐ స్థాయి అధికారి వీఐపీల సౌకర్యాల కల్పనలోనే తరిస్తున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం విచారణను వేగవంతం చేసుకుంది. ఈ ఆరోపణలన్నీ నిజమని తేలితే... చిన్నమ్మకు మరిన్న కష్టాలు వచ్చినట్టే అని తెలుస్తోంది.