: చార్మి విచారణలో సీఐ ధనలక్ష్మికి కీలక బాధ్యతలు!
డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిని మహిళా అధికారులే విచారించాలన్న హైకోర్టు సూచనలతో, చార్మిని ప్రశ్నించే బాధ్యతలను నలుగురు మహిళా అధికారులకు ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్ అప్పగించారు. ఓ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయి అధికారిణితో పాటు మరో ముగ్గురు మహిళా సీఐలు ఈ బృందంలో ఉంటారు. అయితే, గతంలో నార్కోటిక్స్ కేసులో అనుభవమున్న మహిళా సీఐ ధనలక్ష్మి, ప్రధానంగా చార్మిని ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే సిట్ కార్యాలయానికి చేరుకున్న ఆమె, ఉన్నతాధికారులతో కూర్చుని, చార్మికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు, సంధించాల్సిన ప్రశ్నల గురించి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. హైకోర్టు ఇచ్చిన సమయంలో విచారణ పూర్తి కాకుంటే, రేపు మరోసారి విచారిస్తామని సిట్ వర్గాలు చెబుతున్నాయి.