: కెల్విన్ ఫోన్ లో ఛార్మీ దాదా.... వెయ్యికి పైగా వాట్స్ యాప్ సందేశాలు?


టాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో పూరీ, నవదీప్ తరువాత ప్రముఖంగా వినిపించిన పేరు ఛార్మీ. దీంతో ఛార్మీకి సిట్ నోటుసులు జారీ చేసింది. ఈ సమయంలో విచారణ కోసం తమను ఎక్కడికి రమ్మన్నా ఓకే అని చెప్పారు. విచారణ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు. దీంతో ఛార్మీ కూడా సరే అన్నారు. సిట్ కార్యాలయానికే విచారణకు వస్తామని తెలిపారు. అయితే పూరీ, శ్యామ్ కే నాయుడు, తరుణ్, నవదీప్ విచారణ అనంతరం మనసు మార్చుకున్న ఛార్మీ హైకోర్టును ఆశ్రయించారు. తన హక్కులకు భంగం వాటిల్ల కూడదంటూ కోర్టులోవాదన వినిపించారు. సిట్ కూడా దీటుగా వాదన వినిపించింది. అందుకు అవసరమైన సాక్ష్యాలు కోర్టుముందు ఉంచింది. దీంతో ఛార్మీ ఊహించని విధంగా పని వేళల్లో మాత్రమే, మహిళా అధికారిణులతో విచారించాలని, ఆమెను ఇబ్బంది పెట్టవద్దని, అవసరమైతే విచారణ పొడిగించాలని న్యాయస్థానం ఆదేశించింది.

దీంతో ఆమెను విచారించేందుకు సిట్ 100 ప్రశ్నలు సిధ్ధం చేసినట్టు తెలుస్తోంది. ఆమెను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా, ఆమెకు ఎంత సమయం అవసరమైతే అంత సమయం ఇస్తూ విచారణ చేయనున్నారు. ఛార్మీ సమాధానాలను బట్టే విచారణ ఉన్నట్టు సమాచారం. కాగా, కెల్విన్ ఫోన్ లో ఛార్మీ పేరు ఛార్మీ దాదా అని నమోదు చేసి ఉంది. కెల్విన్ తో అంత దగ్గరి సంబంధాలు ఉన్నాయా? అన్నది విచారణలో రాబట్టనున్నారు. 'జ్యోతి లక్ష్మి' సినిమా ఆడియో వేడుకను నిర్వహించిన కెల్విన్ ఆ తరువాత ఆమెతో సుదీర్ఘ సంభాషణలు వాట్స్ యాప్ లో నిర్వహించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. సుమారు వెయ్యికి పైగా సంభాషణలు జరిపినట్టు గుర్తించారు. దానిపై మరిన్ని వివరాలు సేకరించనున్నారు. దీంతో ఛార్మీ కోర్టు కెక్కిన ఫలితం దక్కుతుందా? లేక షాక్ తగులుతూ గతంలో ఎవరినీ విచారించని విధంగా రెండు రోజుల పాటు విచారణ జరగనుందా? అన్న ఆసక్తి రేగుతోంది. 

  • Loading...

More Telugu News