: 'వందేమాతరం పాడాల్సిందే' అంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లిం సంఘాల మండిపాటు!
వందేమాతరం గేయాన్ని వారంలో ఒక్కసారైనా పాడాల్సిందేనని మద్రాసు హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెల్లడించింది. తమిళనాడులోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో వారంలో ఒక్కరోజైనా వందేమాతర గేయం ఆలపించాల్సిందేనని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. కుదిరితే ప్రతిరోజూ వందేమాతరం ఆలపించాలని, లేని పక్షంలో వారంలో ఒక్కరోజైనా గేయాన్ని ఆలపించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
అయితే, దీనిపై ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వందేమాతరం గేయం ముస్లింలకు వ్యతిరేకమని, అందులో కొన్ని అభ్యంతరకర పదాలున్నాయని వారు చెబుతున్నారు. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పోరాడతామని ముస్లిం సంఘాల నాయకులు ప్రకటించారు. ఇప్పటికే గోరక్షాదళాలు రెచ్చిపోతూ సెక్యులర్ దేశాన్ని మత ప్రాతిపదిక దేశంగా మార్చే ప్రయత్నంలో ఉన్నాయని, ఇలాంటి తీర్పులు వారికి మరింత అవకాశంగా మారుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.