: నేడు సిట్ విచారణకు ఛార్మీ.. ప్రశ్నావళితో మహిళా అధికారుల రెడీ!
హైదరాబాదును పట్టిపీడిస్తున్న డ్రగ్ దందాలో నేడు ఛార్మీని సిట్ విచారించనుంది. సిట్ విచారణలో తనకు న్యాయం జరగదని హైకోర్టును ఛార్మీ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ విచారణ ఎదుర్కొనేందుకు ఛార్మీ పూర్తి స్థాయిలో సన్నద్ధం కాగా, ఆమెను విచారించేందుకు ఎక్సైజ్ మహిళా సూపరింటెండెంట్ తో పాటు ముగ్గురు మహిళా సీఐలను సిట్ ఎంపిక చేసింది. వీరు నలుగురూ ఛార్మీని విచారించనున్నారు. ఈ మేరకు ప్రశ్నావళి కూడా సిద్ధం చేశారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఛార్మీని విచారించే అవకాశం ఉంది.