: ఇటలీలో ట్రంప్ మాస్క్‌ లు ధరించి ఏటీఎం దోపిడీ!


ట్రంప్ మాస్క్ ధరించిన ఇద్దరు దుండగులు ఇటలీలోని ఒక ఏటీఎంలో దోపిడీకి పాల్పడ్డారు. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఇటలీలోని ట్యూరిన్ లో ఇద్దరు దొంగలు ఏటీఎంను దోచుకునేందుకు పక్కాగా ప్లాన్ వేశారు. ముఖాలు కనిపించకుండా డొనాల్డ్ ట్రంప్ మాస్క్‌ లు ధరించిన ఆ ఇద్దరు దుండగులు, ఏటీఎంను బాంబుతో పేల్చివేసి, డబ్బులు తీసుకుని పారిపోవడాన్ని గుర్తించిన పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ తతంగం ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

  • Loading...

More Telugu News