: హర్మన్‌ప్రీత్ కౌర్ 84వ నంబరు జెర్సీ ఎందుకు ధరిస్తుందో తెలుసా?.. వివరించిన ఆమె తల్లి


టీమిండియా మహిళా జట్టు తాజా సంచలనం హర్మన్‌ప్రీత్ కౌర్ మైదానంలో 84వ నంబరు ఉన్న జెర్సీని ధరిస్తుంది. అయితే ఇలా ధరించడం వెనక ఓ కథ ఉందని ఆమె తల్లి వివరించింది. 84 అనేది 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం దేశంలో సిక్కులపై జరిగిన దాడులను గుర్తుచేస్తుందని, నాటి ఘటనలో బాధితులకు తన ప్రతి విజయాన్ని ఆమె అంకితం ఇస్తుందని హర్మన్ తల్లి పేర్కొన్నారు. 1984 బాధితులకు నివాళిగానే ఆమె ఆ నంబరు జెర్సీని ధరిస్తారని స్పష్టం చేశారు.

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో హర్మన్ అజేయంగా 171 పరుగులు చేసి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. జట్టును ఫైనల్‌కు చేర్చడంలో ఆమె కీలకపాత్ర పోషించింది. ఫైనల్స్‌లో ఇంగ్లండ్ చేతిలో కొద్దిలో పరాజయం పాలైనప్పటికీ క్రికెట్ అభిమానుల దృష్టిని హర్మన్ మహిళా క్రికెట్ వైపు మళ్లించగలిగింది. హర్మన్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రూ.5 లక్షల నజరానా, పంజాబ్  పోలీసులో డీఎస్‌పీ పోస్ట్ ఇస్తున్నట్టు ప్రకటించారు.

 

  • Loading...

More Telugu News