: ఆ వీడియో ఫేక్.. పేలింది రెడ్‌మీ నోట్ 4 కాదు.. స్పష్టం చేసిన షియోమీ ఇండియా!
బెంగళూరులోని ఓ షోరూములో ఇటీవల షియోమీ కంపెనీకి చెందిన రెడ్‌మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ పేలిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ కంపెనీ ఇండియా హెడ్ మను జైన్ తెలిపారు. పేలింది రెడ్‌మీ నోట్ 4 కాదని స్పష్టం చేశారు. మొబైల్‌లో సిమ్‌కార్డు పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలిపోయినట్టు వీడియో ఫుటేజీ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇది రెడ్‌మీ నోట్ 4 ఫోనేనంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన మను జైన్ మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణ చేపట్టామని, పేలిన ఫోన్ నోట్ 4 కానీ, తమ బ్రాండ్‌కు చెందిన ఇతర ఫోన్ కానీ కాదని తేలిందన్నారు.