: ప్రతి కెప్టెన్ అలాంటి ఆటగాళ్లు జట్టులో ఉండాలని కోరుకుంటారు: విరాట్ కోహ్లీ


ప్రతి కెప్టెన్ హార్దిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ తమ జట్టులో ఉండాలని కోరుకుంటాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. రేపటి నుంచి శ్రీలంక-టీమిండియా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ రేపు ఉదయం పది గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ మాట్లాడుతూ, టీమ్ లో ఆల్ రౌండర్ బ్యాట్స్ మెన్ అదనంగా ఉంటే జట్టుపై ఒత్తిడి తగ్గుతుందని, హార్డిక్ పాండ్యా లాంటి ప్లేయర్ జట్టుకు నిజంగా ఓ వరం అని కోహ్లీ కితాబిచ్చాడు.

ప్రస్తుతం తమ జట్టులో టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు కూడా రాణిస్తుండటం తమకు కలిసొచ్చే అంశమని అన్నాడు. ప్రత్యర్థి జట్టు శ్రీలంకపైనే ఒత్తిడి ఉందని భావిస్తున్నానని చెప్పాడు. కొత్త ఉత్సాహంతో శ్రీలంక పర్యటనకు వచ్చామని, విజయం సాధిస్తామనే నమ్మకం ఉందంటూ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, ఈ టెస్టు సిరీస్ లో రెండో మ్యాచ్ ఆగస్టు 3న కొలంబోలోని ఎస్ఎస్ సీ గ్రౌండ్స్ లో, మూడో మ్యాచ్ ఆగస్టు 12న బలాగొల్లాలోని పల్లెకెళె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు దేశాల మధ్య జరగనున్నాయి.

  • Loading...

More Telugu News