: విశాఖలో ఐటీఐ విద్యార్థి కిడ్నాప్ కలకలం!


విశాఖపట్టణంలో ఐటీఐ విద్యార్థి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. గోపాలపట్నం లక్ష్మీనగర్ కు చెందిన ఐటీఐ విద్యార్థి మణికంఠను దుండగులు కిడ్నాప్ చేశారు. రూ.15 లక్షలు ఇస్తే గానీ, మణికంఠను వదిలిపెట్టమంటూ కిడ్నాపర్లు బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణికంఠ కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కాగా, మణికంఠ తల్లిదండ్రులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ తమ జీవనం సాగిస్తున్నారని, ఆర్థికంగా అంత స్థితిమంతులు కాదని సమాచారం. ధనవంతుడు కాని మణికంఠను కిడ్నాప్ చేయాల్సిన అవసరమేమొచ్చిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మణికంఠ కుటుంబసభ్యుల సెల్ ఫోన్లకు వచ్చిన మెస్సేజ్ ల ఆధారంగా ఆయా ఫోన్ నెంబర్లపై పోలీసులు దృష్టి సారించారు. మణికంఠ మిత్రుడిని కలిసి, అతని ద్వారా మరింత సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News