: ముద్రగడ వెనక వైసీపీ తప్పా, కాపు లెవ్వరూ లేరు: డిప్యూటీ సీఎం చినరాజప్ప


కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వెనక వైసీపీ తప్పా, కాపు లెవ్వరూ లేరని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికే ముద్రగడ పాదయాత్ర తలపెట్టారని, వైసీపీ అధినేత జగన్ ఆడుతున్న నాటకంలో ముద్రగడ పాత్రధారి అని, తన ఉనికిని కాపాడుకోవడానికి మూడు నెలలకోసారి ఆయన డ్రామాలు ఆడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ముద్రగడ పాదయాత్ర ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి కోరితే ఇవ్వడానికి తాను సిద్ధమని చినరాజప్ప చెప్పారు.

  • Loading...

More Telugu News