: డిప్స్ కొట్టిన కత్రినా కైఫ్.. కడుపుబ్బ నవ్వించింది!


అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టైగర్ జిందా హై’ సినిమాలో సల్మాన్ సరసన బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మొరాకోలో జరుగుతోంది. షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న కత్రినా.. తనకు సంబంధించిన ఓ సరదా వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో డిప్స్ కొడుతూ కత్రినా కనబడుతుంది. అయితే, డిప్స్ కొడుతున్న కత్రినా పూర్తి శరీరభాగాన్ని కాకుండా, నడుము వరకు మాత్రమే ఈ వీడియోలో చూపించారు. నిజంగానే, కత్రినా డిప్స్ కొడుతోందని అనుకుంటారు. కానీ, వీడియో చివరికి వచ్చే సరికి అసలు విషయం ఏంటో తెలిసి వీక్షకులు ఆశ్చర్యపోవడమే కాదు కడుపుబ్బ నవ్వుకోవడమూ జరుగుతుంది. మరీ, ఎందుకు ఆలస్యం.. వీడియో చూసేయండి...

  • Loading...

More Telugu News