: న్యాయపరమైన చిక్కులు లేకుండా కాపులను బీసీల్లో చేర్చుతారు: ఎమ్మెల్యే బోండా ఉమ
కాపులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, మంజునాథ కమిషన్ నివేదిక అందిన తర్వాత న్యాయపరమైన చిక్కులు లేకుండా కాపులను బీసీల్లో చేర్చుతారని ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపులకు ఇచ్చిన హామీలను విడతల వారీగా చంద్రబాబు అమలు చేస్తున్నారని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం జగన్, కాపుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. జగన్ మాయలో ముద్రగడ పద్మనాభం, కాపు నేతలు పడొద్దని సూచించారు. ముద్రగడ తలపెట్టనున్న ఆందోళనలో కాపు నేతలు, యువకులు పాల్గొనవద్దని ఈ సందర్భంగా బోండా సూచించారు.