: డ్రగ్స్ కేసు: అవసరమైతే, డోపింగ్ టెస్ట్ మిషన్ తెచ్చి పరీక్షిస్తాం: ఎక్సైజ్ అధికారులు
డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం వచ్చే వాళ్లు ఆధారాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారని, అలోవెరా డ్రింక్ తాగి వస్తున్నారని, ఈ విషయంలో అవసరమైతే డోపింగ్ టెస్ట్ మిషన్ ను తీసుకువచ్చి పరీక్షిస్తామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ విచారణకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తున్నట్టు వెల్లడించింది. తమకు ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరికీ నోటీసులు ఇవ్వలేమని, విచారణ అంతా వీడియో రికార్డింగ్ చేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్ తెస్తున్నారని ఎక్సైజ్ అధికారులు ఆరోపించారు.