: వినియోగదారులకు శుభవార్త! త్వరలో మార్కెట్లోకి బ్లూటూత్ స్పీకర్‌ టోపీ!


ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి కొత్త ఆవిష్కరణలను ఆదరించే వినియోగదారులకు శుభవార్త. త్వరలో మార్కెట్లోకి బ్లూటూత్‌తో కూడిన సరికొత్త బేస్‌బాల్‌ స్పీకర్‌ టోపీ రానుంది. అమెరికాకు చెందిన అటారీ అనే సంస్థ ఈ టోపీని తయారు చేసింది. టోపీ ముందు భాగం లోపలి అంచులో రెండు చిన్నపాటి స్పీకర్లను అమర్చింది. వీటిని బ్లూటూత్‌కి అనుసంధానం చేయడం ద్వారా పాటలు వినవచ్చు. అటారీ సంస్థతో పాటు ఆడియో వేర్ అనే మరో సంస్థతో కలిసి పనిచేసింది. ఈ స్పీకర్ టోపీని మొబైల్ కి కనెక్ట్ చేయడం ద్వారా వాయిస్ కమాండ్ ద్వారా ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇందుకోసం మైక్రోఫోన్లను టోపీలో అమర్చడం జరిగింది. మార్కెట్లోకి ఇంకా విడుదల చేయని ఈ టోపీని, ప్రస్తుతం బీటా వెర్షన్ లో పరీక్షిస్తున్నారు.

 

  • Loading...

More Telugu News