: చెల్లెలు చనిపోతున్న దారుణాన్ని లైవ్ లో చూపించింది!


కారును ప్రమాదానికి గురి చేసి, తన చెల్లెలు ప్రాణాలు కోల్పోతున్న దారుణాన్ని ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యక్ష ప్రసారం చేసిందో యువతి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ దారుణం చోటు చేసుకుంది. 18 ఏళ్ల సాంచెజ్ కాలిఫోర్నియా హైవేపే కారు నడుపుతున్న సందర్భంగా ఆమె అదుపు తప్పింది. ఆ సమయంలో కారులో ఆమె సోదరి జాక్విలిన్ (14)తో పాటు మరో టీనేజ్ అమ్మాయి కూడా ఉంది. ఈ సమయంలో, అదుపు కోల్పోయిన కారు... వైరు ఫెన్సింగ్ ను ఢీకొట్టి, ఆ తర్వాత పల్టీకొట్టింది. ఈ ఘటనలో జాక్వెలిన్, మరో టీనేజ్ అమ్మాయి కారులో నుంచి బయటకు ఎగసిపడ్డారు. జాక్వెలిన్ తీవ్రంగా గాయపడింది. ఆమె తల నుంచి తీవ్రంగా రక్కస్రావమవుతోంది.

ఈ సందర్భంగా ఆమె చెల్లి చనిపోతున్న దృశ్యాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో చూపించింది. ఆమెను చంపాలని తాను అనుకోలేదని, అయినా, ఆమె చనిపోతోందని స్ట్రీమింగ్ సందర్భంగా ఆమె చెప్పింది. కాసేపటికే జాక్వెలిన్ మరణించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

ఈ ప్రమాదంపై ఆమె తండ్రి స్పందించాడు. తన పెద్ద కూతురే చిన్న కూతురును చంపేసిందని అన్నారు. జాక్వెలిన్ ఏదో తప్పు చేసిందని, అందుకు సొంత చెల్లిని ఆమె చంపేసిందని చెప్పాడు. మరోవైపు, ఉద్దేశపూర్వకంగానే కారును అడ్డదిడ్డంగా నడిపి, జాక్వెలిన్ మృతికి సాంచెజ్ కారణమైందని పోలీసులు కేసు నమోదు చేశారు. 

  • Loading...

More Telugu News