: సిట్ విచారణకు వచ్చే వారు ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు: ఎక్సైజ్ అధికారులు


డ్రగ్స్ వ్యవహారంలో సిట్ విచారణకు వచ్చేవారు ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారని ఎక్సైజ్ శాఖ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు జ్యూస్ లు తాగే ప్రయత్నం చేయడం, తల వెంట్రుకల్లో ఆధారాలు లభించకుండా ఉండేందుకు హైలీ కాస్మోటిక్ షాంపూలతో తలస్నానం చేసి విచారణకు వస్తున్నారని అనుమానం వ్యక్తం చేశాయి. పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలు ఉన్నట్టు విచారణా సమయంలో చెబుతున్నారని, డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమ రెండుగా చీలిపోయిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News