: డ్రగ్స్ వ్యవహారంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ పొంగులేటి
డ్రగ్స్ కేసులో సిట్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ లో నైజీరియన్లపై నిఘా కనిపించడం లేదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా గతంలో సంచలనం రేకెత్తించిన బోఫోర్స్ కుంభకోణం గురించి ఆయన ప్రస్తావించారు. ముగిసిన బోఫోర్స్ కేసును బీజేపీ మళ్లీ తెరపైకి తెస్తోందని, రాజీవ్ గాంధీకి చెడ్డపేరు తేవాలని బీజేపీ చూస్తోందని ఆయన మండిపడ్డారు.