: డీఐజీ రూప బయోపిక్... దర్శకుడు `వీరప్పన్` ఫేం ఏఎంఆర్ రమేశ్
నిజజీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడు `వీరప్పన్` ఫేం ఏఎంఆర్ రమేశ్ కర్ణాటక డీఐజీ రూప జీవిత కథను అధ్యయనం చేసే పనిలో పడ్డాడు. పరప్పన జైల్లో అన్నాడీఎంకే నాయకురాలు శశికళ పొందిన వీఐపీ ట్రీట్మెంట్ అంశాన్ని రూప బయటపెట్టిన సంగతి, అది పెద్ద సంచలనం అయిన సంగతి విదితమే. ఇప్పుడు ఆమె జీవిత కథ ఆధారంగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమా తీసేందుకు దర్శకుడు రమేశ్ పూనుకున్నాడు.
ఈ కథలో శశికళ చేసిన అవినీతి పనులను కూడా బయటపెట్టే అవకాశం ఉందని సమాచారం. అలా కాకుండా పూర్తిగా రూప జీవితం చుట్టే కథను నడిపిస్తూ ఆమె 25 సార్లు బదిలీ అవడానికి గల కారణాలను వివరించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి డీఐజీ రూప వ్యక్తిగత వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నా ఆమె ఈ చిత్రం తీయడానికి ఒప్పుకుంటారా? లేదా? అనే విషయం తేలాల్సి ఉంది. గతంలో రాజీవ్‌గాంధీ హత్య కేసుకు సంబంధించి కూడా ఏఎంఆర్ రమేశ్ సినిమా తీశాడు. ఏఎంఆర్ రమేశ్ `వీరప్పన్` సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు.