: ముంబైలో విషాదం..భవనం కూలి 11 మంది మృతి


ముంబైలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి లాల్ బహుదూర్ శాస్త్రి ప్రాంతంలో ఈ రోజు ఉదయం నాలుగు అంతస్తుల భవనం కూలడంతో 11 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 50 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు మాట్లాడుతూ, గత రెండు వారాలుగా భారీ వర్షాలు కురుస్తుండటం, అది పాత బిల్డింగ్ కావడంతో కూలిపోయిందని అన్నారు. అయితే, ఆ బిల్డింగ్ లో నివసిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయమని ముందుగానే హెచ్చరించినప్పటికీ వారు పట్టించుకోలేదని అధికారులు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించామని చెప్పారు. 

  • Loading...

More Telugu News