: కాపు నేతలు గతంలో విధ్వంసానికి పాల్పడ్డారు.. పాదయాత్రలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు తప్పవు: ఏపీ డీజీపీ వార్నింగ్


కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్రకు అనుమతులు లేవని... ఎవరూ ఈ పాదయాత్రలో పాల్గొనరాదని ఏపీ డీజీపీ సాంబశివరావు మరోసారి హెచ్చరించారు. సెక్షన్ 30, 144లు అమల్లో ఉన్నాయని... వీటిని అతిక్రమించి ఎవరైనా పాదయాత్రలో పాల్గొంటే, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. గతంలో కాపు నేతలు విధ్వంసానికి పాల్పడ్డారని... ఎవరైనా ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే పోలీసు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.

ముద్రగడ పాదయాత్రలో సంఘవిద్రోహ శక్తులు పాల్గొనే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తే, తాము చూస్తూ ఊరుకోబోమని డీజీపీ హెచ్చరించారు. మరోవైపు, ముద్రగడ పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

  • Loading...

More Telugu News