: పెద్ద పట్టణాల మధ్య సూపర్ డీలక్స్ డబుల్ డెక్కర్ బస్సులు!


మనదేశంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల మధ్య సూపర్ డీలక్స్ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ఉపరితల రవాణా శాఖ వద్ద ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఉంది. మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రతిపాదన పట్ల సుముఖంగా ఉన్నట్టు సమాచారం. దీనివల్ల జాతీయ రహదారులపై వ్యక్తిగత కార్లు, తదితర వాహనాల రద్దీని కొంతైనా నియంత్రించొచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో ఈ బస్సులను ఎక్కువ మంది వినియోగించేందుకు ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచన కూడా ఉంది. విశేషమేమిటంటే, విమానాల్లో మాదిరిగా ఈ బస్సుల్లోని రెండు అంతస్తుల్లో ఒకటి ఎగ్జిక్యూటివ్ తరగతిగా, మరొకటి ఎకానమీ (చౌక) తరగతిగా ఉండడం. అలాగే, స్టివార్డులు, హోస్టెస్ కూడా ఉంటారు. తినే పదార్థాలు, పానీయాలు కూడా ఉంటాయి. పర్యావరణ అనుకూలంగా ఉండేందుకు విద్యుత్, ఎథనాల్, ఎల్ఎన్జీతో ఈ బస్సులు నడుస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ బస్సుల కొనుగోలుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకోవాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ భావిస్తోంది.

  • Loading...

More Telugu News