: నన్ను నా భార్య రెండు సార్లు రిజెక్ట్ చేసింది: పూరీ చెప్పిన తన ప్రేమ కథ విశేషాలు


ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ పై దాడులతో టాలీవుడ్ లో పెనుకలకలం రేగగా, పూరీ జగన్నాథ్ పై పలు ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అవేవీ పూరీని బలహీన పర్చలేదు సరికదా, కుటుంబం మధ్య బంధాన్ని మరింత బలపర్చింది. ఈ క్రమంలో తన ప్రేమ కథను పూరీ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆసక్తి రేపే పూరీ ప్రేమ కథ వివరాల్లోకి వెళ్తే...గతంలో ఓసారి హైదరాబాదు, రామాంతపూర్‌ లోని ఓ ఇంట్లో ఆయన షూటింగ్ ప్రారంభించారు. ఆ ఇంటి ఓనర్ కుమార్తెను తొలిచూపులోనే పూరీ ప్రేమించారు. స్నేహితురాళ్లతో షూటింగ్ చూస్తున్న లావణ్యను చూడగానే పూరీ తన చేతిలోని సిగిరెట్ ను వదిలేశారట. తరువాత ఒక ఆర్టిస్ట్‌ తో విజిటింగ్ కార్డును ఆమెకివ్వమని పంపించారట. అయితే దానిని ఆమె తిప్పి పంపించారట. దీంతో మరోసారి ఆయన విజిటింగ్ కార్డు పంపితే మళ్లీ ఆమె దానిని తిప్పి పంపారని, వారం తరువాత లావణ్యే ఫోన్ చేసిందని ఆయన తను ప్రేమలో పడిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆమె కళ్లు తనకు బాగా నచ్చడంతో ప్రేమలో పడ్డానని ఆయన తెలిపారు. ప్రేమించడంతో ఆమెకు ఏం వచ్చు, ఏం రావు? అన్న విషయాలు పెద్దగా పట్టించుకోలేదని ఆయన చెప్పారు. వివాహానంతరం ఏమేం వంటలు వచ్చు? అని అడిగితే అన్నం వడడం, ఆమ్లెట్ వేయడం వచ్చని చెప్పగానే తన గుండె జారిపోయిందని ఆయన తెలిపారు. బియ్యం పడేస్తే అన్నం అయిపోతుందని, ఆమ్లెట్ ఎవరైనా వేస్తారని భావించి వంటలు నేర్పించానని పూరీ తెలిపారు. అయితే అంతలోనే పక్కనున్న లావణ్య కల్పించుకుని, బంగాళాదుంప కూర ఒక్కటే నేర్పించారని తెలిపారు. దీంతో పూరీ మళ్లీ అందుకుని, చాలా నేర్పించానని, అయితే మర్చిపోయిందని చెప్పారు. వెంటనే లావణ్య మళ్లీ అందుకుని బంగాళాదుంప ఎప్పుడు చేసినా మాడిపోయేదని, అందుకే గుర్తుందని ఆమె చెప్పడంతో నవ్వులు పూశాయి. 

  • Loading...

More Telugu News