: మేనేజర్ రోనీ అరెస్టుపై స్పందించిన కాజల్... ట్విట్టర్లో వివరణ
డ్రగ్స్ వ్యవహారంలో తన మేనేజర్ జానీ జోసెఫ్ అలియాస్ రోనీ అరెస్ట్‌పై నటి కాజల్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. రోనీ అరెస్టు విషయం తెలిసి తాను షాక్ అయినట్లు, రోనీ వృత్తిపరంగా తెలిసినంత మాత్రాన అతని వ్యక్తిగత విషయాలతో తనకు ఎలాంటి సంబంధం ఉండదని కాజల్ స్పష్టం చేసింది. `రోనీ అరెస్టు విషయం తెలిసి మొదట నేను షాకయ్యాను. సమాజానికి హాని కలిగించే ఇలాంటి వారికి నేను మద్దతు పలకను. నా వృత్తిపర పనుల్లో సహాయం చేసే వారిని నేను బాగా చూసుకుంటున్నంత మాత్రాన వారి వ్యక్తిగత విషయాలను నియంత్రిస్తున్నానని కాదు. ఒక్క మా తల్లిదండ్రులు మినహా ఇండస్ట్రీలో నాకు సహాయం చేసే వారందరితోనూ నేను కేవలం వృత్తిపర స్నేహమే కొనసాగిస్తాను. ఒక్కసారి వారితో వృత్తిపర అవసరాలు తీరిపోయాక వారి స్థితిగతుల గురించి నేను పట్టించుకోను` అని కాజల్ పోస్ట్ చేసింది.