: నీతా అంబానీ ఫోన్ ఖరీదు ఎన్ని వందల కోట్లో తెలుసా?


ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబసభ్యుల జీవనశైలి వారి స్థాయికి తగ్గట్టుగానే ఉంటుంది. రూ. 12వేల కోట్లతో కళ్లు చెదిరే ఇల్లు కట్టినా, రూ. 25 కోట్లతో కారు కొనుగోలు చేసినా అది ఆయనకే సాధ్యం. దాదాపు 160 లగ్జరీ కార్లు ఆయన నివాసంలో కొలువుతీరి ఉంటాయి. వీటికి తోడు సొంత విమానాలు, షిప్ లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో.

ముఖేష్ అంబానీ సతీమణి నీతా ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సెల్ ఫోన్ ధర ఎంతో తెలిస్తే... ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. దీని ఖరీదు  48.5 మిలియన్ డాలర్లు  అనగా అక్షరాలా రూ. 300 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'ఫాల్కన్ సూపర్ నోవా ఐఫోన్6 పింక్ డైమండ్ ఫోన్' ను ఆమె ఉపయోగిస్తున్నారు. ఈ ఫోన్లను కేవలం ఆర్డర్ పైనే తయారు చేస్తారు. ఫోన్ తయారీకి మొత్తం బంగారాన్ని ఉపయోగిస్తారు. నీతా వాడుతున్న ఫోన్ వెనుకవైపు గులాబీ రంగులో ఉన్న వజ్రాన్ని కూడా పొదిగారు. ముఖేష్ అంబానీ కుటుంబంలోని వారంతా అత్యంత ఖరీదైన ఫోన్లనే వాడుతున్నారు. ఇంత ఖరీదైన ఫోన్లను వాడుతున్న అంబానీలు... సామాన్యుల కోసం 4జీ టెక్నాలజీతో కూడిన ఫ్రీ జియో ఫోన్లను అందిస్తుండటం గమనార్హం. జియో ఫోన్ కోసం కేవలం రూ. 1500 డిపాజిట్ కడితే చాలు. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని కూడా వాపసు చేస్తారు. 

  • Loading...

More Telugu News