: అన్ని విద్యాసంస్థల్లో `వందే మాతరం` తప్పనిసరి.... మద్రాస్ హైకోర్ట్ ప్రకటన
తమిళనాడులోని అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాల్లో జాతీయ గేయం `వందేమాతరం` తప్పనిసరిగా పాడాలని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. దేశంలోని ప్రతి పౌరుడు దేశాభిమానం చూపించడం అవసరమని తెలియజేస్తూ కనీసం వారానికి రెండు సార్లయినా అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంబంధ కార్యాలయాల్లో `వందేమాతరం` ఆలపించాలని సూచించింది. ముఖ్యంగా సోమవారం, శుక్రవారం తప్పనిసరిగా ఆలపించాలని ఆదేశించింది.
అలాగే అన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఆఫీసులు, పరిశ్రమలు, సంస్థలు కనీసం నెలకు ఒకసారైనా జాతీయగీతం పాడాలని ఆదేశించింది. ఎవరికైనా పాడటానికి ఇబ్బంది అనిపించి, సరైన కారణం చూపించగలిగితే వారికి మినహాయింపు ఇవ్వొచ్చని తెలిపింది. ఇదే ఆదేశాన్ని దేశవ్యాప్తం చేసే పిటిషన్‌పై ఆగస్టు 25న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గతేడాది జాతీయ గీతాన్ని అన్ని సినిమా థియేటర్లలో సినిమాకు ముందు ప్రదర్శించాలని, ఆ సమయంలో అందరూ నిల్చోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే!