surya: తమిళంలోనూ రకుల్ దూకుడు చూపిస్తోంది!

రకుల్ స్పీడ్ చూసి మిగతా కథానాయికలు కంగారు పడిపోతున్నారు. తెలుగులో అగ్రహీరోల సరసన వరుసగా అవకాశాలను తన్నుకుపోతోన్న ఆమె, తమిళంలోనూ అదే హవాను కొనసాగించడానికి రెడీయైపోయినట్టుగా అనిపిస్తోంది. తమిళంలో కార్తీ సరసన 'ధీరమ్ అధిగారం ఒండ్రు' చేసిన ఆమె .. తాజాగా సూర్య సరసన కూడా ఛాన్స్ కొట్టేసింది.
సూర్య కథానాయకుడిగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఆల్రెడీ విజయ్ సినిమాలోనూ అవకాశాన్ని దక్కించుకున్న ఈ సుందరి, సూర్య మూవీలోను చోటు సంపాదించుకోవడం విశేషం. ఇక హిందీలోను రకుల్ ఆ దిశగానే పావులు కదపడం చూస్తున్నవాళ్లు, దూకుడంటే ఆమెదేనని చెప్పుకుంటున్నారు.