: గగనతలంలో అమెరికాను కవ్వించిన చైనా!


భారత్ సరిహద్దులో పాగావేసి కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా...అమెరికాతో గగనతలంలో కవ్వింపులకు దిగింది. అమెరికాకు చెందిన నేవీ నిఘా విమానానికి కేవలం 300 అడుగుల సమీపంలోకి చైనా విమానాలు వెళ్లాయని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. అమెరికా నేవీకి చెందిన నిఘా విమానం యూఎస్ ఈపీ-3 తూర్పు చైనా సముద్రంపై ఎగురుతున్న సమయంలో చైనాకు చెందిన జే 10 రకానికి చెందిన రెండు యుద్ధ విమానాలు అత్యంత చేరువగా వచ్చి కవ్వింపులకు పాల్పడ్డాయని తెలిపారు.

ఆ సమయంలో చైనా యుద్ధ విమానాలు పూర్తిస్థాయి ఆయుధాలు నింపుకుని ఉన్నాయని చెప్పారు. దీంతో తాము దారి మళ్లాల్సి వచ్చిందని పెంటగాన్ తెలిపింది. ఈ సమయంలో తాము ఆలోచనలో పడ్డామని వారు అన్నారు. గతంలో కూడా చైనా ఇదే రీతిలో తమను అడ్డుకుందని అమెరికా తెలిపింది. కాగా, అప్పుడప్పుడు ఇలాంటివి చోటుచేసుకుంటుంటాయని, తాము ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని చైనా తెలిపింది. 

  • Loading...

More Telugu News