: దేశ 14వ రాష్ట్రపతిగా పదవీబాధ్యతలను స్వీకరించిన కోవింద్!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీబాధ్యతలను స్వీకరించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఖేహర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం కోవింద్ ను ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాన మంత్రులు, గవర్నర్లు, బీజేపీ కురువృద్ధుడు అద్వాణీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. ప్రస్తుతం కోవింద్ ప్రసంగం కొనసాగుతోంది.