: మధ్యాహ్నం 2:30 గంటలకు ఛార్మి పిటిషన్ పై తీర్పు!


సిట్ విచారణ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రముఖ సినీ నటి ఛార్మీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిని విచారించిన న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలు వింది. తీర్పును నేటి మద్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సిట్ తన వాదనలు వినిపిస్తూ, విచారణలో తామెవరినీ ఇబ్బంది పెట్టడం లేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకుంటున్నామని వివరించారు. హైదరాబాదు ముంబైలా మారిందని, ఛార్మీ పిటిషన్ ఒక పబ్లిసిటీ స్టంట్ అని 'సిట్' కోర్టుకు స్పష్టం చేసింది.

సినిమా ఇండస్ట్రీని తాము లక్ష్యం చేసుకోలేదని, కొంత మంది వల్లే సినీ పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందని సిట్ న్యాయస్థానానికి తెలిపింది. విచారణ సందర్భంగా పూరీ నుంచి ఇష్టపూర్వకంగానే శాంపుల్స్ సేకరించామని, నవదీప్ నిరాకరించడంతో అతని నుంచి తీసుకోలేదని సిట్ అధికారులు న్యాయస్థానానికి వివరించారు. అయినా తప్పు చేయనప్పుడు, అలవాటు లేనప్పుడు విచారణలో సహకరించేందుకు ఉన్న ఇబ్బందులేమిటని పిటిషనర్ ను అడగాలని సిట్ న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తన తీర్పును మధ్యాహ్నం 2:30కి వాయిదా వేసింది. 

  • Loading...

More Telugu News