: కాసేపట్లో కోవింద్ ప్రమాణం.. భారీ కాన్వాయ్ మధ్య పార్లమెంటుకు బయల్దేరిన ప్రణబ్, కోవింద్!
భారతదేశ 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రపతి భవన్ లో కోవింద్ కు, ఆయన సతీమణికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు ప్రణబ్ దాదా. అనంతరం, వారిద్దరూ అక్కడ నుంచి పార్లమెంటుకు బయల్దేరారు. ప్రణబ్ ముఖర్జీ, కోవింద్ ఇద్దరూ ఒకే కారులో బయల్దేరారు. భారీ సంఖ్యలో అశ్వకదళం వెంటరాగా, భారీ కాన్యాయ్ తో వారు అక్కడ నుంచి బయల్దేరారు. కాసేపట్లో పార్లమెంటు సెంట్రల్ హాల్ లో రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత రాష్ట్రపతి సైనిక వందనం స్వీకరిస్తారు.