: బాబాయ్ కోసం రామ్ చరణ్ తేజ్ త్యాగం!
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ముఖ్యంగా రానున్న ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండటంతో... పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమాను సంక్రాంతి కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఈ సినిమా జవసత్వాలను అందిస్తుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చక్కటి ఔట్ పుట్ తో అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేసేలా చూడాలని త్రివిక్రమ్ కు పవన్ సూచించారట.
మరోవైపు, సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'రంగస్థలం' సినిమాను కూడా సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. అయితే, తన బాబాయ్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారనే ఊహాగానాలు రావడంతో... రామ్ చరణ్ ఆలోచనలో పడ్డాడట. పవన్ సినిమా సంక్రాంతికి వచ్చేటట్టైతే... తన సినిమాను అంతకన్నా ముందే క్రిస్మస్ కు విడుదల చేయాలనే యోచనలో చరణ్ ఉన్నాడట. ఈ సినిమా బాబాయ్ రాజకీయ జీవితానికి చాలా ముఖ్యమైంది కావడంతో... ఆ సినిమాతో తన సినిమాకు క్లాష్ రాకుండా చూడాలని దర్శకనిర్మాతలను చరణ్ కోరాడట.