: వికెట్ కీపర్ సుష్మా వర్మకు డీఎస్పీ పదవి... హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన
ఐసీసీ మహిళల వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు ఫైనల్ వరకు వెళ్లడంలో వికెట్ కీపర్‌గా తన వంతు కృషి చేసిన సుష్మా వర్మకు డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ పదవి ఇస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ప్రకటన చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించి హిమాచల్ ప్రదేశ్‌కు సుష్మ మంచి పేరు తీసుకువచ్చిందని ఆయన ప్రశంసించారు. అలాగే ఫైనల్‌లో ఓడిపోయినా తమ శాయశక్తులా ప్రయత్నించారని భారత జట్టును ఆయన కొనియాడారు. 1992లో సిమ్లాలో జన్మించిన సుష్మా వర్మ జాతీయ స్థాయి క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా, రైట్ హ్యాండ్ బ్యాట్స్‌విమన్‌గా రాణించారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన ఏకైక క్రికెటర్ సుష్మా వర్మ.