: మహిళా క్రికెట్ జట్టుకు నజరానా ప్రకటించిన బీసీసీఐ... ఒక్కొక్కరికి 50 లక్షలు!


ఐసీసీ మహిళా ప్రపంచ కప్‌ లో రన్నరప్‌ గా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. బుధవారం స్వదేశానికి రానున్న మిథాలీ సేన వెసులుబాటును బట్టి సన్మాన తేదీ, వేదికను బీసీసీఐ నిర్ణయిస్తుంది. ఈ సన్మాన కార్యక్రమంలో జట్టులో భాగమైన క్రీడాకారిణులందరికీ తలా 50 లక్షల రూపాయలను, సహాయ సిబ్బందికి తలా 25 లక్షల రూపాయలను అందజేయనుంది. మరోపక్క, ప్రధాని నరేంద్ర మోదీతో మహిళా క్రికెట్ జట్టు భేటీకి బీసీసీఐ ఏర్పాట్లు చేయనుంది. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళా క్రికెట్ జట్టుకు 50 లక్షల రూపాయల నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. భోపాల్ లో జట్టును సన్మానించి, సత్కరిస్తామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News