: జాతీయ పతాకాన్ని అపసవ్య దిశలో పట్టుకున్నందుకు.. క్షమాపణలు చెప్పిన అక్షయ్ కుమార్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ కు చేరిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రోత్సహించేందుకు లార్డ్స్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీఐపీ గ్యాలరీలో నుంచి మ్యాచ్ ను వీక్షిస్తూ, భారత జాతీయ పతాకాన్ని చేబూనాడు. అయితే అక్షయ్ జాతీయ పతాకాన్ని అపసవ్య దిశలో పట్టుకున్నాడు. దీనిపై విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పాడు. కాగా, ఫైనల్ లో ఓటమి అనంతరం నిరాశలో కూరుకుపోయిన మహిళా క్రికెటర్లలో అక్షయ్ కుమార్ ఉత్సాహం నింపాడు. వారితో గడిపి వారిని ఆనందంలో ముంచెత్తాడు. వారు సాధించిన ఘనతకు వారిని అభినందించాడు.