: టీనేజ్‌లో స్థూలకాయమా.. బీ కేర్‌ఫుల్!.. పెద్దపేగు కేన్సర్‌కు దారితీస్తుందంటున్న పరిశోధనలు!
అధిక బరువు, స్థూలకాయంతో బాధపడుతున్న టీనేజర్లలో పెద్దపేగు కేన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. అధికబరువు, స్థూలకాయం వల్ల కౌమార దశలో ఉన్న వారిలో పెద్దపేగు కేన్సర్ (కోలన్ కేన్సర్) వచ్చే అవకాశం 54 శాతం ఎక్కువగా ఉందని ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఒబెసిటీ కారణంగా పురుషుల్లో 71 శాతం, మహిళల్లో అంతకంటే ముందే కేన్సర్ బారిన పడే అవకాశం ఉందని అధ్యయనకారులు తెలిపారు. 10,87,358 మంది యూదు యవకులు, 7,07,212 మంది యూదు యువతులపై 1967 నుంచి 2002 వరకు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడినట్టు వారు వివరించారు.