: దేశ రాజధానిలో పేలుతున్న టమాటా ధర.. కేజీ రూ.100 మాత్రమే.. మరికొన్ని వారాలు అంతే!


దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో ఏకంగా రూ.100 పలుకుతున్నాయి. మరో రెండు వారాలు ఇదే ధర కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఆజాద్‌పూర్ మండీలో వివిధ అసోసియేషన్లు బంద్‌కు పిలుపు ఇవ్వడంతో టమాటా రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. మండీలోని తమ షెడ్లను కొందరు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ వ్యాపారులు ఆందోళనకు దిగారు.

దీంతో కూరగాయల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీనికి తోడు పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా టమాటా దిగుబడి తగ్గిపోయింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి రోజుకు 200 టన్నుల టమాటాలు రావాల్సి ఉండగా సోమవారం అందులో 20 శాతమే దిగుమతి అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అజాద్‌పూర్ వెజిటెబుల్ ట్రేడర్స్ బాడీ జనరల్ సెక్రటరీ అనిల్ మల్హోత్రా తెలిపారు. ఇతర కూరగాయల సరఫరా కూడా 20 శాతం తగ్గినట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News