: తిరుమలలో బాలిక కిడ్నాప్.... కిడ్నాపర్ ఫోటో విడుదల చేసిన పోలీసులు
తిరుమలలో ఏడేళ్ల బాలిక కిడ్నాప్ కు గురైంది. శ్రీవారి సన్నిధిలో భక్తులకు నామాలు పెట్టి జీవనం సాగించే చిరు వ్యాపారి ఏడేళ్ల కుమార్తెను ఒక మహిళ మాయమాటలు చెప్పి అపహరించింది. మహిళ బాలికకు మాయమాటలు చెప్పి, తీసుకెళ్తున్న వివరాలు సీసీ కెమెరాలో లభ్యమయ్యాయి. దీంతో ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు కిడ్నాపర్ ఫోటోలు, వీడియో విడుదల చేశారు. మహిళను తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, తిరుమలలో వరుస కిడ్నాప్ ఘటనలు పెను కలకలం రేపుతున్నాయి.