: మళ్లీ పాత గూటికి చేరే ప్రయత్నాల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి?


ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెర వెనుక ప్రయత్నాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయని సమాచారం. ఢిల్లీలోని ఏఐసీసీ నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు సమాచారం. కాగా, నాడు విభజన బిల్లును వ్యతిరేకించిన ఆయన, చివరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నారని, ఈ క్రమంలోనే తన ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.

  • Loading...

More Telugu News