: ఒత్తిడే మమ్మల్ని ఓడించింది: కెప్టెన్ మిథాలీ రాజ్


మహిళల ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై పోరాడి ఓడిన టీమిండియాపై ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ లండన్ లో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. జట్టులోని ప్రతి ఒక్కరం ఒత్తిడికి గురయ్యామని, అదే తమను ఓడించిందని చెప్పింది. ఓవర్ లో ఐదు లేదా ఆరు పరుగులు చేయాల్సి వచ్చినప్పుడు ఉత్కంఠ పెరిగిపోతుందని చెప్పింది. వేద కృష్ణమూర్తి క్యాచ్ ను హెథర్ నైట్ వదిలివేసినప్పుడు, టీమిండియా విజయం ఖాయమని అనుకున్నామని చెప్పింది. అయితే, తమకు 10 పరుగులు అవసరమైన సమయంలో వికెట్ కోల్పోవడంతో ట్రోఫీని చేజార్చుకున్నామని మిథాలీ రాజ్ భావోద్వేగానికి గురైంది.

  • Loading...

More Telugu News