: కెల్విన్ అమాయకుడు.. డ్రగ్స్ కేసుతో అతనికి సంబంధం లేదు!: అడ్వొకేట్ రేవంత్ రావు
డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టయిన మాదకద్రవ్యాల సరఫరాదారుడు కెల్విన్ అమయాకుడని ఆయన తరపు న్యాయవాది రేవంత్ రావు అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ఈ కేసుతో కెల్విన్ కు సంబంధం లేదని, సిట్ అధికారులు ఏ ఒక్క సాక్ష్యం కోర్టుకు ఇవ్వడం లేదని ఆరోపించారు. కెల్విన్ డ్రగ్ సరఫరాకు పాల్పడ్డారనే సాక్ష్యాలు కనుక ఉంటే వెంటనే బయటపెట్టాలని అన్నారు.
కెల్విన్ అసలు డ్రగ్స్ అమ్మనేలేదని, సినిమా వాళ్లకు డ్రగ్స్ విక్రయించాడని చెప్పడం అబద్ధమని, ఇవన్నీ పోలీసులు సృష్టించినవేనని ఆరోపించారు. కెల్విన్ ను కలిసేందుకు అతని తల్లిదండ్రులను కూడా కలవనీయడం లేదని, అతని హక్కులను అధికారులు కాలరాస్తున్నారని రేవంత్ రావు ఆరోపించారు.