: ‘రెడ్ మి నోట్ 4’ ఫోన్ కూడా పేలింది!


గతంలో శాంసంగ్ ఫోన్లు పేలిన సంఘటనలు మనకు తెలిసిందే. తాజాగా, ప్రముఖ చైనీన్ మొబైల్ బ్రాండ్ షియోమి ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన రెడ్ మి నోట్ 4 ఫోన్ కూడా పేలింది. ఈ సంఘటన బెంగళూరులోని ఓ మొబైల్ స్టోర్ లో జరిగింది. బెంగళూరుకు చెందిన అర్జున్ అనే వ్యక్తి స్థానిక మొబైల్ షోరూంలో ‘రెడ్ మి నోట్ 4’ ను కొనుగోలు చేశాడు. ఫోన్ లో సిమ్ అమర్చే విషయమై ఇబ్బందిపడ్డ అతను, తిరిగి అదే షోరూమ్ కు వెళ్లాడు. అక్కడి టెక్నీషియన్ ఈ ఫోన్ ప్యానెల్ ను తీస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వచ్చి అది పేలిపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో అర్జున్ ఫిర్యాదు చేశాడు. ఫోన్ పేలిన సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

  • Loading...

More Telugu News