: ఎవరినీ భయపెట్టి రక్తనమూనాలు సేకరించలేదు: చంద్రవదన్
డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటివరకు విచారణ ఎదుర్కొన్న వారిని ఎవరినీ భయపెట్టి రక్తనమూనాలు, గోళ్లు, వెంట్రుకలు సేకరించలేదని, వారి ఇష్టప్రకారమే తీసుకోవడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రవదన్ స్పష్టం చేశారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి తమ విచారణ జరుగుతోందని, అధికారుల విచారణా తీరు సరిగా లేదంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న హీరోయిన్ ఛార్మి హైకోర్టును ఆశ్రయించిన విషయమై ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. హైకోర్టు ముందు తాము కూడా సాక్ష్యాలు చూపిస్తామని చంద్రవదన్ అన్నారు.