: అప్పట్లో మన సైన్యం కొంచెం తొందరపడి ఉంటే.. నవాజ్ షరీఫ్, ముషారఫ్ ఇద్దరూ ప్రాణాలు కోల్పేయేవారు!
1999 నాటి కార్గిల్ యుద్ధానికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది. అప్పట్లో మన సైన్యం ఏ మాత్రం తొందరపడినా అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్, అప్పటి పాక్ సైన్యాధ్యక్షుడు ముషారఫ్ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయేవారట. వివరాల్లోకి వెళ్తే, 1999 జూన్ 24వ తేదీన ఉదయం 8.45కి భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం గుల్తేరి స్థావరంపై దాడి చేసేందుకు బయల్దేరింది. అక్కడ బాంబు వేసేందుకు పైలట్ సిద్ధపడగా... బాంబు వేయకుండా పైలట్ ను పలుమార్లు ఎయిర్ కమండోర్ వారించారు. ఆ స్థావరంలో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఉన్నట్టు గుర్తించి, ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ ఆర్మీకి గుల్తేరీ స్థావరం ప్రధాన కేంద్రంగా పని చేసింది.