: ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసిన లోక్ సభ స్పీకర్


పార్లమెంటు సమావేశాలు ఈ రోజు వాడివేడిగా కొనసాగాయి. గోరక్షణ పేరుతో జరుగుతున్న హత్యలపై చర్చించాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ వెల్ లోకి దూసుకు పోయారు. మోదీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ సుమిత్రా మహాజన్ పై పేపర్లు చింపి విసిరేశారు. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన స్పీకర్... హద్దులు మీరి ప్రవర్తించిన ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగురు ఎంపీలను ఐదు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కు గురైనవారిలో అధీర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, కే సురేష్, రంజిత్ రంజన్, సుష్మిత దేవ్, ఎంకే రాఘవన్ లు ఉన్నారు. ఆ తర్వాత కూడా సభ సజావుగా సాగలేదు. సస్పెన్షన్ ఉత్తర్వులను తప్పుబడుతూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో, సభను రేపటికి వాయిదా వేశారు. 

  • Loading...

More Telugu News